టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు

-

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు ఏర్పాటు కానుంది. ఈ దిశగా సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. యాదగిరిగుట్ట పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోనున్నారు. తాజాగా దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

The Yadagirigutta Devasthanam Board is going to be formed on the lines of TTD

అటు ఫిబ్రవరి 10లోగా టూరిజం పాలసీ సిద్దం చేయాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్‌ రెడ్డి. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాలలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version