ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపి గెలుపు ఖాయం – కాల్వ శ్రీనివాసులరెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి – 1, వైసిపి ఆరు స్థానాలలో విజయం సాధించాయి. ఎమ్మెల్సీగా టిడిపి అభ్యర్థి అనురాధ 23 ఓట్లతో గెలుపొందారు. టిడిపి అభ్యర్థి గెలుపు పై స్పందించారు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులరెడ్డి. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 108 నియోజకవర్గాల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. వైసిపి ఈ తీర్పుకు కొత్త భాష్యం చెబుతోందని.. గ్రాడ్యుయేట్ ఓటర్లు మా ఓటర్లు కాదు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసిపి వ్యతిరేక ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నిన్నటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేల్లో కూడా వ్యతిరేకత ఉన్నట్లు వ్యక్తం అయిందన్నారు. జగన్ తీరుపై ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉందని స్పష్టం అయిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపి గెలవడం ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు కాల్వ శ్రీనివాసుల రెడ్డి.