ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జనాభా కంటే తెల్ల రేషన్ కార్డు జనాభానే ఎక్కువని రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోటి 49 లక్షల తెల్ల రేషన్ కార్డులు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాయని, ఒకవైపు జిడిపి పెరిగిందని చెబుతూనే, మరొకవైపు దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య కూడా పెరిగిందంటున్నారని, కేంద్రం 80 లక్షల కార్డులకు రేషన్ సరఫరా చేస్తుందని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో కోటిన్నర మంది లబ్ధిదారులు ఉన్నారని వెల్లడించారు.
అంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జనాభాకు మించి లబ్ధిదారులు ఉన్నట్లే లెక్క అని రఘురామకృష్ణ రాజు తెలిపారు. అదంతా ఎవరి జేబులోకి వెళ్తుంటే ప్యాలెస్ లో ఉంటూ పేదవారి తరఫున పెత్తందారులపై పోరాటం చేస్తున్న వారి జేబుల్లోకి వెళ్తోందని అన్నారు. రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న వాలంటీర్లు లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా 20 కిలోలకు రెండు వందల రూపాయల చొప్పున నగదు ఇచ్చి, ఆ బియాన్ని బ్లాక్ లో విక్రయిస్తున్నారని, రేషన్ అంటే కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారని, బియ్యం మాత్రమే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు బియ్యం మాత్రమే సరఫరా చేస్తుందని తెలిపారు.