Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహా శివరాత్రి ఉత్సవాల హడావిడీ కనిపిస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు వేములవాడ రాజన్న ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. రేపే మహా శివరాత్రి పర్వదినం ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున వేములవాడ రాజన్న స్వామి వారికి సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్.
తిరుమల తిరుపతి దేవస్థానం తరుఫున ఇవాళ సాయంత్రమే వేములవాడ రాజన్న స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు టిటిడి అధికారులు, అర్చక బృందం. ఇక మహా శివరాత్రి నేపథ్యంలో మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. 1500 పోలీసులతో మహా శివ రాత్రి జాతర బందో బస్తు ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న ఉత్సావాల నేపథ్యంలోనే..జాతర కోసం 994 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కేటాయింపులు చేశారు.