మాన్సాస్ భూముల సమస్య పరిష్కారానికి యత్నిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. విశాఖలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారామణరెడ్డి.. సింహాచలం, ఇతర అనుబంధ ఆలయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడారు. రుషికొం భవన నిర్మాణాలు పిచ్చి పని అన్నారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పారు.
రుషికొండ భవనాల వినియోగం పై ప్రజాభిప్రాయం తీసుకోవాలని కోరారు. అమరావతిలో చంద్రబాబు సచివాలయం నిర్మించారని గుర్తు చేశారు. జగన్ వచ్చాక దానిని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రజా ఆస్తులను తాకట్టు పెట్టే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. జగన్ హయాంలో అంతా సైకో పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.