ఏపీలో దారుణం.. మద్యం మత్తులో భార్య, కూతురును హత్య చేసిన వైనం..!

-

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. తొండూరు మండలం తుమ్మలపల్లిలో  భార్య, కూతురిని కొడవలితో నరికిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. గంగాధరరెడ్డి మద్యం మత్తులో భార్య శ్రీలక్ష్మి(37), కుమార్తె గంగోత్రి (14)లను గొంతులు కోశాడు. మతిస్థిమితం లేక భార్య, కుమార్తెను భర్త హత్య చేశారు. శ్రీలక్ష్మి అంగన్వాడి కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తుంది.


కుమార్తె గంగోత్రి ఎనిమిదో తరగతి చదువుతుంది. భర్త గంగాధర్ కి మతిస్థిమితం లేదు. ఎప్పుడు
మద్యం తాగుతూ ఉంటాడు. సోమవారం రాత్రి భార్య, కుమార్తె నిద్రిస్తున్న సమయంలో కొడవలితో
వారిపై దాడి చేసి హత్య చేశాడు. మంగళవారం శ్రీలక్ష్మి వీధిలోకి రాకపోవడంతో అంగన్ వాడీ కార్యకర్త
ఫోన్ ద్వారా ప్రయత్నించారు. సమయంలో భర్త గంగాధర్ రెడ్డి ఫోన్ ఎత్తి నా భార్యను చంపేశానంటూ సమాధానం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గంగాధర్ ని అదుపులోకి తీసుకున్నారు.   కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news