భూ భారతి ప్రజామోదం పొందింది.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

-

ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు ఆమోదించిన భూభారతి 2020 చట్టాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారని.. ప్రజా మోదం పొందిందాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన రెవెన్యూ డైరీ ను ప్రసాద్ అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఆవిష్కరణ సభలో మంత్రి పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని.. సంక్రాంతి లోపు తహసీల్దారుల ఎన్నికల తిరుగు బదిలీలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత దస్త్రాన్ని పంపించాల్సిందిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కి ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. సీఎం ఆమోదించినప్పటికీ సమయభావం వల్ల గత కేబినెట్లో నూతన గ్రామ రెవెన్యూ వ్యవస్థకు, 33 మంది సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఆమోదం పొందలేకపోయాం అన్నారు. కేబినెట్ తప్పనిసరిగా ఆమోదింప చేస్తామని ఉద్యోగుల అర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఉద్యోగులందరూ నిజాయితీగా పనిచేసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ శాఖను ప్రతిష్టపరిచి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Latest news