కాకినాడ కూటమిలో చీలికలు వచ్చాయి. కాకినాడ లో జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, టిడిపి ఎమ్మెల్యే కొండబాబు వర్గాల మధ్య వైన్ షాప్ స్థలం కోసం ఆధిపత్య పోరు చోటు చేసుకుంది. చెరో షాపు లాటరీ లో గెలుచుకున్నారు హైదరాబాద్ కి చెందిన వ్యక్తి, స్థానిక టిడిపి నేత. అయితే… తాను షాపు పెట్టుకోవడానికి స్థలము ఇప్పించాలని జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను కోరారు హైదరాబాద్ కి చెందిన వ్యక్తి.

సంజయ్ నగర్ లో ఒక స్థలం సెట్ చేసింది జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వర్గం. అదే స్థలం తమ వారికి ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్యే కొండబాబు వర్గం పట్టు పడుతోంది. అంతేకాదు.. ఇప్పటికే షాప్ ఓపెన్ చేసేశారు టిడిపి ఎమ్మెల్యే కొండబాబు వర్గం నేతలు. దీంతో టిడిపి నేతలపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టుకుంటూ.. రెచ్చిపోతున్నారు.