నేడు నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల

-

శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచి నీటిని విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయానికి సాగర్‌ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను 182.95 టీఎంసీలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం 4 గంటలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నీటిని విడుదల చేయనున్నారు.

 

 

మరోవైపు బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు నాగార్జునసాగర్లో 20.98 టీఎంసీల నిల్వ పెరిగింది. సాగర్‌ వద్ద 3.69 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 4.64 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 10 గేట్లు, ఏపీ, తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్ల ద్వారా 5.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి 3.03 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నది నుంచి 1.79 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం వైపు విడుదలవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news