రూ.4 కోట్లు కొల్లగొట్టిన రాంగ్ కాల్..!

-

సాధారణంగా కొన్ని రాంగ్ కాల్స్.. కొందరికీ కొత్త పరిచయాలను అందిస్తాయి. మరికొందరి జీవితాల్లో ప్రేమ చిగురించడం.. ఇంకొందరి జీవితాలను సర్వనాశనం చేస్తుండటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ రాంగ్ కాల్ విలువ అక్షరాల రూ.4కోట్ల వరకు వెళ్లింది. ముక్కు మొహం తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆ మహిళాకు ముచ్చేమటలు పట్టించింది. సుమారు రూ.4కోట్లు వదిలించింది. ఏళ్ల పాటు నరకం చూడాల్సిన పరిస్తితి నెలకొంది.

వివరాల్లోకి వెళ్లితే.. ఎనిమిదేల్ల కిందట ఓ రాంగ్ కాల్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళతో పరిచయం ఏర్పరుచుకున్నాడు శ్రీకాళహస్తికి చెందిన అక్షయ్ కుమార్ అనే వ్యక్తి. ఆ పరిచయం వారి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. దీంతో ఆమెతో పర్సనల్ గా ఉన్న సమయంలో వీడియోలను రికార్డు చేశాడు. కొంత సమయం తరువాత అతని నిజస్వరూపాన్ని చూపించాడు. పర్సనల్ వీడియోలను చూపించి బెదిరించసాగాడు. నాలుగు కోట్ల నగదు, 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేసి జల్సాలు చేయసాగాడు. అంతేకాదు.. తన కోరిక తీర్చాలంటూ పదే పదే వేధింపులకు గురిచేసేవాడు. అతని వేధింపులు ఆగకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తిరుపతిలో అతన్ని అరెస్ట్ చేసి విశాఖకు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news