హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు ఏకపక్షమే!

-

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు ఏకపక్షమే అని తెలుస్తోంది. ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో ఎవరి బలాబలాలు ఎంతంటే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం ఓట్లు – 110 (81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్అఫిషియో సభ్యులు).. 3 డివిజన్లకు కార్పొరేటర్లు లేరని లెక్కలు చెబుతున్నాయి. ఎంఐఎం పార్టీ బలం – 49 (1 ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 40 మంది కార్పొరేటర్లు) ఉన్నట్లు సమాచారం.

 

Hyderabad local body MLC elections are almost one-sided

బీఆర్ఎస్ పార్టీ బలం – 25 (3 రాజ్యసభ ఎంపీలు, 2 ఎమ్మె ల్సీలు, 5 ఎమ్మెల్యేలు, 15 మంది కార్పొరేటర్లు) ఉన్నారు. బీజేపీ పార్టీ బలం – 19 (1 ఎంపీ, 1 ఎమ్మెల్సీ, 19 మంది కార్పొరేటర్లు) కాగా… కాంగ్రెస్ పార్టీ బలం – 14 (1 రాజ్యసభ ఎంపీ, 4 ఎమ్మె ల్సీలు, 2 ఎమ్మె ల్యేలు, 7 కార్పొరేటర్లు) ఉన్నారు. ఎంఐఎం పార్టీ 49 ఓట్లతో బలంగా ఉండటం.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్ద తు ఇస్తుండడంతో ఎంఐఎం పార్టీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news