సాయిధరమ్‌ తేజ్‌ ప్రచారంలో ఉద్రిక్తత

-

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసైనికులపై కొంతమంది ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. సినీ హీరో సాయి ధరమ్‌తేజ్‌ కాన్వాయ్‌ ముందుకు వెళుతున్న తరుణంలో గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో తాటిపర్తి గ్రామానికి చెందిన జనసైనికుడు నల్లల శ్రీధర్‌ గాయపడ్డాడు. ఈ ఘటనతో తాటిపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా సాయి ధరమ్‌తేజ్‌ ప్రచారం నిర్వహించేందుకు తాటిపర్తికి వస్తున్నారని తెలిసి భారీగా జనసైనికులు తరలివచ్చారు. స్థానిక గజ్జాలమ్మ కూడలికి చేరుకుని పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో.. అక్కడికి సమీపంలో ఉన్న శిబిరంలో నుంచి వైసీపీ వర్గీయులు జగన్‌కు మద్దతుగా నినాదాలు చేయగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సాయి ధరమ్‌ తేజ్‌ తాటిపర్తి కూడలిలో మాట్లాడి చినజగ్గంపేట వెళ్లగా.. ఆయన తిరిగి వచ్చేలోపు వైసీపీ వర్గీయులు టపాకాయలు కాల్చి కవ్వింపు చర్యలకు దిగడంతో పాటు.. నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు సాగాయి. సాయిధరమ్‌తేజ్‌ తిరిగి వెళ్తుండగా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో నల్లల శ్రీధర్‌ అనే జనసైనికుడికి తలకు తీవ్ర గాయమైంది.

Read more RELATED
Recommended to you

Latest news