ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరుల హక్కులను హరిస్తుంది : మల్లాది విష్ణు

-

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కలిశారు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గం తన్నీరు నాగేశ్వరరావు విజయవాడ డిప్యూటీ మేయర్. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరుల హక్కులను హరిస్తుంది.. ప్రశ్నించే గొంతు నొక్కుతుంది అని మాజీ MLA మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు. ఎవరో చేసే ప్రచారాన్ని వైస్సార్సీపీ పై నెడుతున్నారు అని ఆరోపించారు.

అలాగే జగన్ పై తప్పుడు కేసులు పెడుతున్నారో వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.. చంద్రబాబు ప్రభుత్వం అబద్దాలు, అసత్య ప్రచారం పై ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దోపిడీ జరుగుతుంది. కృష్ణ పరివాహక ప్రాంతం నుండి లక్షల టన్నులు హైదరాబాద్ తరలించారు. ఉచిత ఇసుక కి తూట్లు పొడుస్తున్న తెలుగు తమ్ముళ్లను ఎందుకు వొదిలేయాలి. సోషల్ మీడియా లో ఇబ్బధులు పెడుతున్నారో వాళ్ళు అందరిపై చర్యలు తీసుకోండి.. ఏక పక్షముగా చేస్తే కుదరదు. చర్యలు తీసుకోకపోతే మా పోరాటం మరింత ఉదృతం చేస్తాం అని పేర్కొన్నారు మల్లాది విష్ణు.

Read more RELATED
Recommended to you

Exit mobile version