చంద్రబాబు, లోకేష్ లను వెంటనే అరెస్టు చేయాలి : సుధాకర్ రెడ్డి

-

నియంతలు పాలించే దేశాల్లో కన్నా ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రశ్నించే గొంతును దారుణంగా నొక్కేస్తున్నారు. ప్రధాన మీడియాను చంద్రబాబు తన కబంధ హస్తాల్లో బంధించారు అని వైసీపి ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రజల పక్షాన నిలపడిన ఛానల్స్ ని కేబుల్ టీవీల్లో రాకుండా చేశారు. మిగిలిన సోషల్ మీడియాని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన సాగుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.

తాడేపల్లి కొంపలో స్టేషనరీ కోసం రూ.9 కోట్లు ఖర్చు పెట్టారంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ లో పెట్టారు. తప్పుడు సమాచారం పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేస్తారా లేదా.. విజయమ్మ కారు టైర్ పంక్చర్ అయితే తల్లిని చంపటానికి జగన్ ప్రయత్నించాడని ట్విట్టర్ లో పెట్టారు. మరి దీనిపై విజయవాడ సీపి కేసు నమోదు చేస్తారా లేదా.. నారా లోకేష్ తప్పుడు ట్వీట్ లు పెడుతుంటే పోలీసు కమిషనర్ ఏం చేస్తున్నారు. చట్టం అందరికీ సమానమైతే పోలీసు కమిషనర్ రాజశేఖర్ వారందరిపై కేసులు పెట్టాలి. చంద్రబాబు, లోకేష్ లను వెంటనే అరెస్టు చేయాలి అని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version