టీటీడీపై వైసీపీ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు !

-

టీటీడీపై వైసీపీ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. చారిత్రాత్మక కట్టడాలను, వారసత్వ సంపదను పరిరక్షించేందుకు 1958లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసిందని రఘురామకృష్ణ రాజు గారు వెల్లడించారు. తిరుమలలోని వెయ్యి కాళ్ల మండపాన్ని 2011లో కూల్చి వేశారని, అప్పుడు చారిత్రాత్మక కట్టడాలను, వారసత్వ సంపదను కూల్చి వేయవద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్కియాలజీ, మ్యూజియం శాఖల డైరెక్టర్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన అధికారికి ఒక లేఖ రాశారని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారని తెలిపారు.

అయినా ఇప్పుడు కూడా తిరుమలలోని 600 సంవత్సరాల క్రితం నిర్మించిన పార్వేటి మండపాన్ని కూల్చి వేయడం పట్ల రఘురామకృష్ణ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్వేటి మండపం ఛాయాచిత్రాన్ని మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రదర్శించారు. ఏమాత్రం చెక్కుచెదరని పాల్వేటి రాజులు నిర్మించిన పాల్వేటి మండపాన్ని కూల్చివేసి, దాని స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులను పైన వేసి మరొక నిర్మాణాన్ని చేపట్టారని, వందల సంవత్సరాల క్రితం నిర్మించిన చెక్కుచెదరని నిర్మాణాన్ని కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ నూతన నిర్మాణాన్ని చేపట్టాలని అనుకుంటే, మరొక ప్రాంతంలో నిర్మించి ఉండవచ్చు కదా అంటూ నిలదీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనాధికారిగా ఐఏఎస్ అధికారిని నియమించాల్సి ఉండగా, జగన్ మోహన్ రెడ్డి గారు డిప్యూటేషన్ పై వచ్చిన అధికారి ధర్మారెడ్డి గారిని నియమించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news