నామినేషన్ వేళ ఐటీ దాడులతో భయపెడుతున్నారని ఆగ్రహించారు మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మధిర కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పొంగులేటిపై ఐటీ దాడులను ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి కుట్ర పన్నుతున్నాయని ఫైర్ అయ్యారు. నామినేషన్ వేళ ఐటీ దాడులతో భయపెట్టాలని చూడటం సరికాదు.. పొంగులేటికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు భట్టి విక్రమార్క.
ఇక అటు ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి స్పందించారు. నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? అని ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ – కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇదని ఆగ్రహించారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం అని తెలిపారు.