రుషికొండకు గుండు కొట్టి నిర్మించిన అక్రమ భవన సముదాయంలోకి జగన్ మోహన్ రెడ్డి గారు తన మకాం మార్చితే అడ్డంగా దొరికిపోతారని, రుషికొండపై పర్యాటక భవనాలను నిర్మిస్తున్నామని కోర్టుకు చెప్పి, నివాస సముదాయం, కార్యాలయాలను నిర్మించడం ఖచ్చితంగా కోర్టును తప్పుదారి పట్టించడమే అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. దీనితో జగన్ మోహన్ రెడ్డి గారికి సమస్యలు తప్పవని హెచ్చరించారు.
హైకోర్టు ఈ కేసును కొట్టి వేసినప్పటికీ, రుషికొండపై భవన నిర్మాణాలకు సంబంధించిన ఉల్లంఘనలను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.రాజధాని మార్పుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, మిలిటరీ రెడ్డి, మంత్రులు ఇచ్చిన ప్రకటనలన్నీ కోర్టుదిక్కరణే అవుతాయని, రాజధాని కేసును డిసెంబర్లో వింటామని న్యాయస్థానం చెప్పిందని, జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు భయపడే డిసెంబర్ లో రుషికొండపై నిర్మించిన భవనంలోకి మకాం మారుస్తామని చెప్పి ఉంటారేమో?!. లేదంటే రాక్షస గురువైన శుక్రాచార్యులు లాంటి వారు ఎవరైనా డిసెంబర్లో మంచి ముహూర్తాన్ని సూచించి ఉంటారేమోనని అపహాస్యం చేశారు. తరచూ పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని చెప్పే జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి పేదవారి ఆస్తులు ఎంత?, ఆయన చెల్లించే ఆస్తి పన్ను ఎంత?, రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాలలో ఆయనకున్న ప్యాలెస్ లు ఎన్ని??… లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రి పేదవాడ అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని రఘురామకృష్ణ రాజు గారు కోరారు.