ఏప్రిల్ లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు !

-

దిక్కుతోచని స్థితిలో దేశం, ముఖ్యమంత్రికున్న జనాదరణ చూసి చంద్రబాబు నాయుడు గ్యాంగ్ లో గుబులు అంటూ సాక్షి దినపత్రికలో ఒక సరదా కథనాన్ని రాశారని రఘురామకృష్ణ రాజు ఎద్దేవా చేశారు. టీడీపీ గెలిచిన స్థానాలలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించినట్లుగా పేర్కొంటూనే, సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 175 స్థానాలలో వైకాపా విజయం సాధిస్తుందని పేర్కొన్నారని, కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరగవని, ఏప్రిల్ లో జరిగే ఎన్నికలలో ఓడిపోతామన్నది వారి భావన కావచ్చునని అన్నారు.

ఓట్లు తొలగిస్తున్నారని పచ్చ మీడియా విష రాతలు రాస్తుందన్నారని, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను వీరు తొలగించవచ్చునని, లేని వారి పేరిట ఓట్లను నమోదు చేయించవచ్చునని, ఒక్కొక్కరి పేరిట మూడేసి ఓట్లను, చనిపోయిన వారి పేరిట దొంగ ఓట్లను నమోదు చేయించవచ్చునని, దిక్కుమాలిన వాలంటీర్లను ప్రజలపైకి వదిలివేసి వారి చేత వెట్టి చాకిరి చేయించుకుంటూ తీవ్రమైన అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతుంటే… అవి పచ్చ మీడియా రాతలు… రామోజీరావు రాతలు అంటే నమ్మడానికి జనాలు ఏమైనా పిచ్చివారా?, వారికి నిజ, నిజాలు తెలియదా అంటూ ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version