ఇసుక పేరుకే ఫ్రీ.. డబ్బులు సమర్పించుకోవాల్సిందేనని వైసీపీ పార్టీ సంచలన విషయాలను బయటపెట్టింది. కూటమి సర్కారు తాత్కాలిక కొత్త విధానంలో ప్రత్యేకత ఇదంటూ… పన్నుల మోత, రవాణా చార్జీలు, నిర్వహణ ఫీజులు తడిసిమోపెడు అవుతాయని ఆరోపణలు చేసింది వైసీపీ పార్టీ. ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చ నేతలదే.. రవాణా ముసుగులో బయటకు తరలించి సొమ్ము చేసుకునే యత్నాలు చేస్తున్నారని పేర్కొంది.
దాదాపు 40 లక్షల టన్నులు గత 40 రోజుల్లో మాయం చేసిందని ఆరోపణలు చేసింది. స్టాక్ పాయింట్లు వద్ద సగం నిల్వలను కొల్లగొట్టిన టీడీపీ నేతలు…దాదాపు 40 లక్షల టన్నులు గత 40 రోజుల్లో మాయం చేసినట్లు వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. వర్షాకాలం అవసరాలకు ముందుగా నిల్వ చేసింది గత ప్రభుత్వం. జగన్ హయాంలో ఏటా ఖజానాకు రూ.780 కోట్ల ఆదాయం వచ్చిందని సమాచారం. ఇప్పుడు ఉచితమంటూ జనం నుంచే ముక్కుపిండి వసూలు చేస్తున్నారట. ఉసూరుమంటూ ఖాళీగా తిరిగి వెళ్తున్నారట వినియోగదారులు. వర్షాకాలం ముగిసిన తర్వాతే తాపీగా కొత్త విధానం ఉంటుందని వైసీపీ పార్టీ ఫైర్ అవుతోంది.