ఏపీలో చంద్రబాబు, పవన్‌ చేస్తానన్న అభివృద్ధి ఇదేనా? – వైసీపీ

-

ఏపీలో చంద్రబాబు, పవన్‌ చేస్తానన్న అభివృద్ధి ఇదేనా? అంటూ ప్రశ్నించింది వైసీపీ పార్టీ. వైసీపీకి నాయకురాలు పాలేటి కృష్ణవేణి, భర్త రాజ్ కుమార్ పై దాడికి పాల్పడ్డారు. అతని చొక్కా విప్పించి మోకాళ్లపై కూర్చోబెట్టి లోకేష్ పోస్టర్ ముందు ఆయన కాళ్ళు పట్టించి క్షమాపణలు చెప్పించారు. అలాగే టీడీపీ నేతల కాళ్ళు సైతం పట్టించుకున్నారు.

Apologies to Lokesh on his knees

మరోసారి లోకేష్ పై విమర్శలు చేస్తే సహించేది లేదంటూ పరుష పదజాలంతో మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. దీనిపై వైసీపీ పార్టీ సీరియస్‌ అయింది. ఇదీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి! ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి నుండి హృదయాన్ని కదిలించే విజువల్స్ అంటూ పేర్కొంది.
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో దళితుల కోసం గళం విప్పిన వారిని టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. దళితుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు, నారా లోకేష్‌ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఏపీలో చంద్రబాబు, పవన్‌ చేస్తానన్న అభివృద్ధి ఇదేనా? అంటూ ప్రశ్నించింది వైసీపీ పార్టీ.

 

Read more RELATED
Recommended to you

Latest news