అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వైసిపి సర్కార్ ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్టులలో పెట్టారని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలోని వివిధ సర్వీస్ల నుంచి 16 మందిని డిప్యూటేషన్ పై తీసుకురాగా వారిలో పదిమంది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అంటూ ఓ లిస్ట్ విడుదల చేశారు. కీలక శాఖలలో సామాజిక వర్గ అధికారులను నియమించి సీఎం జగన్ దోపిడీకి పాల్పడుతున్నాడని ఆరోపణలు కూడా చేశారు.
ఒకే వర్గం అధికారులకు పెత్తనం మరియు కీలక పదవులలో నియమించడంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన సంచలన ఆరోపణలకు వైసీపీ సర్కార్ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ముఖ్యoగా ఈనాడు పత్రికను టార్గెట్ చేసింది వైసిపి. తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫైర్ అయింది వైసిపి పార్టీ. టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు సామాజిక వర్గానికి చెందిన అధికారులు గురించి ఈనాడుకు ఎందుకు గుర్తుకు రాదు.
కేంద్రం నుంచి బాబు హయాంలో ఐఏఎస్ అధికారులు జాస్తి కృష్ణ కిషోర్, సంధ్యారాణి, రాజమౌళి,వెంకయ్య చౌదరి, సాంబశివరావు ఇలా ఎంతో మంది ఏపీ క్యాడర్ కు వచ్చారని వైసిపి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వీరితో పాటు బాబుకు అనుకూలంగా వ్యవహరించే ఎంతోమంది ఐఏఎస్ అధికారులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చారని…. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా ఎంతోమంది అధికారులను బాబుకు అనుకూలంగా ఉన్న వారిని తమకు నచ్చిన చోట పోస్టింగ్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు అని తెలిపింది. లేనిది ఉన్నట్లు గా చూపించే పచ్చదండు గురువు రామోజీరావు నేతృత్వంలో టన్నుల కొద్ది విషం చిమ్మి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది అని ఈనాడుపై వైసిపి ఫైర్ అవుతోంది.
టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు సామాజిక వర్గానికి చెందిన అధికారులు గురించి ఈనాడుకు ఎందుకు గుర్తుకు రాదని మండిపడింది. కేంద్రం నుంచి బాబు హయాంలో ఐఏఎస్ అధికారులు జాస్తి కృష్ణ కిషోర్, సంధ్యారాణి, రాజమౌళి,వెంకయ్య చౌదరి, సాంబశివరావు ఇలా ఎంతో మంది ఎపి క్యాడర్ కు వచ్చారని స్పష్టం చేసింది వైసిపి.మొత్తానికి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలకు వైసిపి పార్టీ గట్టగానే కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు.