తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు. తెలంగాణలో మొత్తం 119 నియోజక వర్గాలకు పోలింగ్ జరుగనుంది. ఈ తరుణంలో కొడంగల్ లోని zphs పోలింగ్ బూత్ లో రేవంత్ రెడ్డి ఓటు వేస్తారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి… కోదాడ లోని గ్రేస్ వ్యాలీ ఐడియల్ స్కూల్ లో ఓటు వేస్తారు. మధిర పట్టణంలోని సుబ్దరయ్య నగర్ మండల పరిషత్ పాఠశాలలో భట్టి విక్రమార్క ఓటు వేస్తారు. నల్గొండ పట్టణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేస్తారు. బ్రహ్నన వెల్లంల గ్రామంలో.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటు వేస్తారు. సంగారెడ్డి పట్టణంలో ఓటు వేస్తారు ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి. జగిత్యాల పట్టణంలోని 148 బూత్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఓటు.వేస్తారు.