భూతవైద్యం.. యువకుడి బలి

-

కర్నూలు: మద్దికెర మండలం పెరవలిలో దారుణం జరిగింది. భూతవైద్యానికి యువకుడు బలి అయ్యాడు. మూర్ఛ వ్యాధి ఉన్న నరేష్(24) అనే యువకుడ్ని తల్లిదండ్రులు భూతవైద్యునికి చూపించారు. దెయ్యం పట్టిందని ఈత బర్రెలు, కర్రలతో యువకుడ్ని భూత వైద్యుడు కొట్టారు. దీంతో నరేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ నరేష్ మృతి చెందారు.

పెరవలి గ్రామానికి చెందిన నరేష్ డిగ్రీ చదివి కూలి పనులకు వెళ్తున్నాడు. ఈ నెల 1న మూర్ఛ వ్యాధితో అస్వస్థతకు గురయ్యాడు. నరేష్‌కు దెయ్యం పట్టిందని తల్లదండ్రులు భూత వైద్యునికి చూపించారు. దెయ్యాన్ని వదిలిస్తానంటూ నరేష్‌ను చితకబాదారు. తీవ్రగాయాలైన నరేష్ మృత్యువుతో పోరాడి చనిపోయారు. నరేష్ స్నేహితులే డబ్బులు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news