ys jagan mohan reddy key post to perni nani: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో కాస్త డీలా పడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేందుకు..ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయసాయి రెడ్డి బాధ్యతలను పార్టీ ఫైర్ బ్రాండ్ పేర్ని నానికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్.
ఇకపై ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను ఆయనే చూసుకుంటారని సమాచారం అందుతోంది. అటు జగన్ నివాసం వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నివాసం వద్ద పోలీ సులు నిఘా పెంచారు. భద్రత చర్యల్లో భాగంగా మొత్తం 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు.