‘లైలా’ సినిమాను బాయ్ కాట్ చేస్తాం.. వైసీపీ రచ్చ !

-

విశ్వక్సేన్… నటించిన లైలా సినిమాకు కొత్త చిక్కులు వచ్చాయి. ఈ సినిమాను బైకాట్ చేయాలంటూ… సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వైసిపి కార్యకర్తలు లైలా సినిమాను బైక్ ఆడ్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ పెడుతున్నారు.

Vishwak Sen Laila has got new complications for the film

లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం రాజుకుంది. మేకల సత్యం అనే క్యారెక్టర్ సీన్ షూట్ చేసేటప్పుడు…. ఒక సంఘటన జరిగిందని… పృధ్వి రాజు వెల్లడించారు. అందులో మొదట 150 మేకలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

కానీ చివరికి వచ్చేసరికి ఆ మేకలు లెక్కిస్తే 11 కు చేరుకున్నాయని సెటైర్లు పేల్చారు పృధ్విరాజ్. దీంతో వైసిపిని ట్రోల్ చేశారని… లైలా సినిమా పైన పడిపోయారు వైసిపి కార్యకర్తలు. దీంతో వెంటనే ఈ సినిమాను బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version