ఏపీ హిస్ట‌రీలో.. ఈ రేంజ్‌ దూకుడు జ‌గ‌న్‌కే సాధ్య‌మా..?

-

ఏపీ సీఎం జ‌గ‌న్ పాల‌న‌కు ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలోనే ఆయ‌న అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌నను ఇంటి వ‌ద్ద‌కే పాల‌న చేసి.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తెర‌మీదికి తెచ్చి.. ప్ర‌తి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాన్నీ ప్ర‌జ‌ల‌కు చేరువ చేశారు. అయితే, తాజాగా తీసుకున్న నిర్ణ‌యం.. చేసిన ప‌ని మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ హిస్ట‌రీలోనే ఎవ ‌రూ చేయ‌లే ద‌నేది వాస్త‌వం. రాష్ట్రంలో దాదాపు ల‌క్ష ఉన్న సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు భారీ ప్యాకేజీ ప్ర‌క‌టించారు సీఎం జ‌గ‌న్‌. నిజానికి ఈ ప‌రిశ్ర‌మ‌ల్లో దాదాపు 10 ల‌క్ష‌ల మంది ఉపాధి పొందుతున్నారు.

ప్ర‌స్తుతం లాక్‌డౌన్తో ఈప‌రిశ్ర‌మ‌లు ఉపాధి కోల్పోయాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ వీటిని పునరుద్ధ‌రించుకునేందుకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద 1110 కోట్లు విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. తొలి విడ‌త‌గా ఇప్పుడు 450 కోట్ల‌ను విడుద‌ల చేయ‌డం ఏపీ హిస్ట‌రీలోనే తొలి అంకంగా ఆయా ప‌రిశ్ర‌మ‌ల నిర్వాహ‌కులు చెబుతున్నా రు. అంతేకాదు, గత ప్రభుత్వం 2016-17లో రూ.195 కోట్లు, 2017-18లో రూ.207 కోట్లు, 2018-19లో రూ. 313 కోట్లు బ‌కాయిల‌ను కూడా ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌భుత్వం చెల్లించ‌డం రికార్డు స్థాయిలో ఆయ‌న దూర దృష్టిని తెలియ‌జేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎంఎస్‌ఎంఈలను కాపాడుకోకపోతే నిరుద్యోగం పెరుగుతుందని ఈ సంద‌ర్భంగా సీఎం జగన్ అభిప్రా యం వ్యక్తం చేశారు. వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు తక్కువ వడ్డీకి ఇప్పించేలా రూ.200 కోట్లు కార్పస్‌ నిధి ఏ ర్పాటు చేస్తామన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఈ రంగం పూర్తిగా కుదేలైన పరిస్థితిలో వీరిని ఆదుకునేం దుకు ఈ ఒక్క‌టే కాకుండా గ‌డిచిన మూడు మాసాల లాక్‌డౌన్ కాలానికి 188 కోట్ల మేర‌కు విద్యుత్ బిల్లుల ‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డం మ‌రో రికార్డుగా మారింది. మొత్తంగా ఈ ప‌రిస్థితి గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ చేయ‌లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలా వ్య‌వ‌హ‌రించాలంటే ఓ రేంజ్ దూకుడు ఉండాల‌ని.. అది జ‌గ‌న్‌కే సాధ్య‌మైంద‌ని చెబుతున్నారు. నిజ‌మే క‌దా!!

Read more RELATED
Recommended to you

Exit mobile version