కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ నామినేషన్ వేశారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. మొదట ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద షర్మిల నివాళులు అర్పించారు. షర్మిలతో పాటు వైఎస్ సునీత ప్రార్థనల్లో పాల్గొన్నారు. నామినేషన్ పత్రాలను ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం ఇడుపులపాయ నుంచి ర్యాలీగా వెళ్లి కడప కలెక్టరేట్లో ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కడప జిల్లా ప్రజలు ఎన్నికల్లో మంచి తీర్పు ఇవ్వాలని షర్మిల కోరారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని, రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యం కావాలంటే అది కేవలం కాంగ్రెస్‌తోనే అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల ఓవైపు కూటమి నేతలు, మరోవైపు వైసీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.