దానం నాగేందర్‌ భూకబ్జాపై మళ్లీ ఫిర్యాదు

-

Danam Nagender : కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ భూకబ్జాపై మళ్లీ ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌లోని తన ఇంటి వెనక రోడ్డు స్థలాన్ని ఆక్రమించారట కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌. బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే..కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తన ఇంటి వెనక రోడ్డు స్థలాన్ని ఆక్రమించారట.

Danam Nagender complains again about land grab

ఇటీవలే ఆ స్థలంలోని బ్లూ షీట్లను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకుంది షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది. అయితే… అధికారులు ఆక్రమణలను తొలగించినా మళ్లీ బ్లూ షీట్లు ఏర్పాటు చేశారు దానం నాగేందర్. ఆక్రమణలను తొలగించినా తిరిగి ఏర్పాటు చేసి స్థలాన్ని ఆక్రమించుకోవడంతో స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ తరుణంలోనే.. భూకబ్జాపై మళ్లీ అధికారులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. తొలగించేందుకు వెళ్ళిన రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనుచరులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news