బియ్యాన్ని పందికొక్కుల్లా తిన్నారు.. వైసీపీపై షర్మిల ట్వీట్‌ !

-

బియ్యాన్ని పందికొక్కుల్లా తిన్నారు.. అంటూ వైసీపీపై షర్మిల సంచలన ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో PDS రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని ఫైర్‌ అయ్యారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణం. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ అని మండిపడ్డారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని వెల్లడించారు. కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉంది. ఎవరికి దక్కాల్సిన వాట వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్ళుమూసుకుందని ఆగ్రహించారు.

గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చు అంటూ వైసీపీ పార్టీని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అక్రమ బియ్యాన్ని పట్టేందుకు మీరు బోట్లు వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదు. నిజాలు నిగ్గు తేల్చండని డిమాండ్‌ చేశారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version