ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. చెన్నారెడ్డి వర్థంతి సందర్భంగా ఇందిరాపార్క్‌లోని చెన్నారెడ్డి మొమోరియల్ రాక్ గార్డెన్స్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మహేశ్ గౌడ్ నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణ్ దేవ్ వర్మ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ..ఉమ్మడి ఏపీలో మాజీ సీఎం దివంగత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి దూరదృష్టి గల నాయకుడని కొనియాడారున ఆయన 28వ వర్ధంతి సందర్భంగా చెన్నా రెడ్డి చేసిన సేవలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సామాజిక న్యాయం, సమానమైన అభివృద్ధి కోసం పోరాడారని, ఆయన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు అని, ఆయన ప్రగతిశీల విధానాలు రాష్ట్రంపై చెరగని ముద్ర వేసాయన్నారు.మర్రి చెన్నారెడ్డి దార్శనికత తరతరాలకు ఉపయోగపడుతుందన్నారు.