కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పడుకున్న షర్మిల

-

ఏపి కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైస్ షర్మిల వినూత్న నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పడుకున్నారు షర్మిల. నిరుద్యోగుల సమస్యలపై పోరాడటానికి ‘ఛలో సచివాలయం’కు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వగా ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో షర్మిలను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆమె కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే ఉండి రాత్రి అక్కడే బస చేశారు.

ys sharmila slept in congess office

ఈ తరుణంలోనే ఏపి కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైస్ షర్మిల మాట్లాడుతూ… వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు. ఇనుప కంచెలు వేసి మమ్మల్ని బందీలు చేశారు.నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారన్నారు.

మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే.ఇందుకు మీ చర్యలే నిదర్శనం.CWC సభ్యులు గిడుగు రుద్రరాజు,వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఏపి కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news