APCC చీఫ్ వైఎస్ షర్మిల వరస పర్యటనలతో దూకుడు పెంచారు. ఇవాళ బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.
కాగా, వైసీపీ ప్రభుత్వంతోపాటు TDP, JSP, BJPపై విమర్శలు చేస్తూ షర్మిల కేడర్ లో ఉత్సాహం తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఆమె వెంట సీనియర్ నేతలు KVP రామచంద్రరావు, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు కూడా పర్యటనలు చేస్తున్నారు.
కాగా, వైఎస్ఆర్సిపి ,జనసేన ,తెలుగుదేశం పార్టీలు బిజెపికి బానిసలుగా మారాయని వైయస్ షర్మిల ఆరోపించారు.శుక్రవారం నాడు షర్మిల గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్. రాష్ట్రంలో YSR పాలన ఎక్కడా లేదు. హామీలు ఇచ్చి మోసం చేయడం YSR పాలన కాదు. ఇది గుంటూరు, కానీ గుంటలూరుగా మార్చారు. గుంటలూరు మళ్లీ గుంటూరు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ కి ఓటేస్తే ప్రత్యేక హోదా వస్తుంది’ అని షర్మిల హామీ ఇచ్చారు.