మేడారం జాతరపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీచేశారు. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులకు మంత్రి సీతక్క కీలక సూచనలు చేశారు. జాతర పనులకు ఈ నెల 31 వరకు డెడ్ లైన్ విధించారు. గడువులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. 300 సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
ఇక అటు తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. జాతరలకు వెళ్లే ప్రయాణికులకు చార్జీలు వసూలు చేయకూడదని ఆయన కోరారు. మేడారం సహా ఇతర జాతరలకు వెళ్లే మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణాన్ని తొలగించి టికెట్ వసూలు చేస్తామని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లో నూ ఉచిత ప్రయాణం విధానం అమలు చేయాల్సిందేనని ఆదేశించారు. ఆ ఖర్చు అంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో అస్సలు వెనుక అడుగు వేయకూడదని ఆర్టీసీ యాజమాన్యానికి సూచించారు.