జగన్‌ సంచలన నిర్ణయం..ఆ పోస్టుల భర్తీ చేస్తూ ప్రకటన !

-

జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు.

YSR Congress Party president and former Chief Minister YS Jaganmohan Reddy has appointed some others as presidents of affiliated divisions as part of the filling up of posts in the YSR Congress Party

వైయస్సార్‌సీపీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్‌ నాగిరెడ్డిని, రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును, రాష్ట్ర మైనారిటీ సెల్‌ అధ్యక్షుడిగా ఖాదర్‌బాషాను నియమించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డిని, రాష్ట్ర మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్‌ను, రాష్ట్ర వాలంటీర్‌ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్‌ను, రాష్ట్ర వైయస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా గౌతంరెడ్డిని, నియమించారు.

రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డిని, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉషను, రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోసమరెడ్డి సునిల్‌ను,
రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్‌రాజును, రాష్ట్ర గ్రీవెన్స్‌ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తిని, రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version