తెలంగాణ పిసిసి, మంత్రివర్గ విస్తరణపై కీలక సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా నాయకుల అభిప్రాయ సేకరణ ముగిసింది. ఇక ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణ పిసిసి నూతన అధ్యక్షుడు నియామకం పై అధికారిక ప్రకటన రానుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ప్రత్యేకంగా ఈ కీలక సమావేశానికి అధిష్ఠానం ఆహ్వానించడం గమనార్హం. పిసిసి నూతన అధ్యక్షుడు నియామకం, మంత్రివర్గ విస్తరణ పై తెలంగాణ సిఎమ్, ఉప ముఖ్యమంత్రి, ఉత్తేమ్ ల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం.
ముందుగా,శుక్రవారం మధ్యాహ్నం ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో విడివిడిగా తెలంగాణ నేతల అభిప్రాయలను తెలుసుకున్న పార్టీ అధిష్ఠానం.
ఆ తర్వాత, ఈ రోజు రాత్రి ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశంలో ముగ్గురు నేతల నుంచి ఉమ్మడిగా అభిప్రాయం తెలుసుకుంది. అయితే.. కొత్తగా పీసీసీ రేసులోకి మంత్రి శ్రీధర్ బాబు వచ్చినట్లు సమాచారం. ఆయన మొదట్లో సీఎం పదవి అడిగారు. ఇక ఇప్పుడు పీసీసీ అడుగుతున్నారట. అంతిమంగా, సేకరించిన అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.