వైఎస్సార్ కాపు నేస్తం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం వైఎస్ జగన్. కాసేపటి క్రితమే… నిడదవోలుకు చేరుకున్న జగన్… కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం చేశారు. అర్హులైన 3,57,844 మంది మహిళలకు లబ్ది చేకూరేలా డబ్బులు రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయం అందించారు సీఎం జగన్.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. అక్క చెల్లెమ్మ లకు ఏటా 15వేలు ఇచ్చే మంచి కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేయడం సంతోషంగా ఉందని.. నేరుగా అక్క చెల్లెమ్మ ల ఖాతాలోకి డబ్బులు పంపుతున్నామని చెప్పారు.
ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదని వివరించారు. ఈ ఒక్క పథకం ద్వారా లబ్ధి పొందిన అక్క చెల్లెమ్మ లు నాలుగు లక్షల మందని తెలిపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా ఇప్పటికీ 60వేలు ఇచ్చాము…అన్నగా, తమ్ముడిగా అక్క చెల్లెమ్మ మంచి కోసం బాధ్యతయుతంగా ఆలోచన చేశామని వెల్లడించారు జగన్.