చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకించిన వారంతా దొంగలే అంటూ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాపు నేస్తం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం వైఎస్ జగన్. కాసేపటి క్రితమే… నిడదవోలుకు చేరుకున్న జగన్… కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. అక్క చెల్లెమ్మ లకు ఏటా 15వేలు ఇచ్చే మంచి కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఇన్ని దొంగ తనలు చేసినా, ఎన్ని వెన్ను పోటు పొడిచిన చంద్ర బాబును రక్షించు కునేందుకు దొంగలా ముఠా ఉంది.. కానీ చట్టం ఎవరికైనా ఒక్కటే అంటూ పేర్కొన్నారు. సామాన్యుడి కి ఎలాంటి శిక్ష పడుతుందో.. అదే శిక్ష రాజకీయ నాయకులకు అదే వర్తిస్తుంది అని చెప్పే వాళ్ళు చంద్ర బాబుకు లేరంటూ చురకలు అంటించారు సీఎం జగన్. ఇంత అన్యాయం జరుగుతున్న ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా.. అన్నవాడు ప్రశ్నించడని పవన్ కళ్యాన్ కు చురకలు అంటించారు.