దోచుకోవడం, పంచుకోవటం, తినటం నా విధానం కాదు – సీఎం జగన్‌

-

దోచుకోవడం, పంచుకోవటం, తినటం నా విధానం కాదన్నారు సీఎం జగన్‌. వరుసగా ఐదో ఏడాది..”వైఎస్సార్ వాహన మిత్ర” నిధులు విడుదల అయ్యాయి. ఈ మేరకు బటన్‌ నొప్పి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. ఇవాళ విజయవాడలో పర్యటించిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి…వరుసగా ఐదో ఏడాది..”వైఎస్సార్ వాహన మిత్ర” నిధులు విడుదల చేశారు.

YSR Vahana Mitra funds released
YSR Vahana Mitra funds released

ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ మాట్లాడుతూ.. విపక్షాలు చెబుతున్న మోసాలు, అబద్దాలు నమ్మకండి… త్వరలోనే వాళ్ళంతా మీ ఇంటికి వస్తారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాం అంటారు… ఒక బెంజ్ కార్ ఇస్తాం అంటారు…పెత్తందార్లకు, పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం అని గమనించండని పిలుపునిచ్చారు. పేద వాడిని రక్షించుకునే దిశగా అడుగులు వేస్తున్నామని… పేద ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు మీరు అడుగులు వేయాలన్నారు. పేదలను మోసం చేసే ప్రభుత్వం రాకుండా అడ్డుకునే దిశగా అడుగులు వేయాలని కోరారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news