కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..కానిస్టేబుల్ మృతి

-

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అతివేగమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వేగంగా వెళ్లకూడదని అధికారులు చెబుతున్నప్పటికీ వాహనదారులు మాత్రం అవేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అతివేగంతో అధికారులను, పోలీసులను సైతం వాహనాలతో ఢీ కొంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందాడు.

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. కామారెడ్డి జిల్లా గాంధారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ రవి (38) అక్కడిక్కడే మరణించాడు. గాంధారి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుళ్ళుగా పనిచేస్తున్న రవి, సుభాష్ తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తూ రోడ్డు పక్కన నిలబడ్డారు. ఇక ఇదే సమయంలో ఒక కారు అతి వేగంగా వారి పైకి దూసుకొచ్చింది.  దీంతో కానిస్టేబుల్ రవి గాల్లో ఎగిరి పడ్డాడు. కారును ముందుగానే గమనించిన సుభాష్ పక్కకి పరిగెత్తగా ప్రాణాలు దక్కాయి. కానీ రవి అనే కానిస్టేబుల్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news