డిక్లరేషన్ వివాదం పై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి.. వక్రీకరించకండి !

తిరుమల డిక్లరేషన్ వివాదం పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సోనియా గాంధీ, వైయస్ఆర్ కూడా గతంలో శ్రీవారిని దర్శించుకున్న సమయంలో డిక్లరేషన్ పై సంతకం చెయ్యలేదని ఆయన అన్నారు. ఈ నెల 23వ తేదీన పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో వైయస్ జగన్ డిక్లరేషన్ పై సంతకం చెయ్యరని చెప్పానన్న ఆయన హిందువేతరులు ఎవరైనా డిక్లరేషన్ పై సంతకం చేసి దర్శనం చేసుకోవాలని చట్టంలో ఉందని అన్నారు.

సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు ఎవరు డిక్లరేషన్ పై సంతకం చెయ్యడం లేదని, గుర్తించిన భక్తుల నుంచి మాత్రమే డిక్లరేషన్ తీసుకుంటున్నామని అన్నారు. జగన్ గతంలో పలు మార్లు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఎప్పుడు డిక్లరేషన్ సమర్పించలేదని ఆయన అన్నారు. దయచేసి నా మాటలను వక్రీకరించకండని వైవీ సుబ్బారెడ్డి కోరారు. అయితే ఇక తిరుమల లో డిక్లరేషన్ పై సంతకం చెయ్యక్కర్లేదని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించినట్టు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఈ విషయం మీద వైవీ సుబ్బారెడ్డి స్పందించక తప్పలేదు.