ఏపీ : మళ్లీ తెరపైకి ఒక రేషన్ కార్డుకు ఓకే పించన్.. ?

-

ప్రస్తుతం ఒకే కుటుంబం రకరకాల పింఛన్లను పొందవచ్చు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ విధానానికి త్వరలో చెక్ పెట్టబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఒక రేషన్ కార్డు ఉంటే ఒకే పింఛన్ అందుతుంది అనే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు కూడా మళ్లీ అదే అంశం తెరపైకి వచ్చింది. గతేడాది మే నెలలో ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొనడంతో వెనక్కి తగ్గింది.

కానీ ప్రస్తుతం ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో రెండు రకాల పించన్ తీసుకుంటే విధానం రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని రకాల పింఛన్లకు దీని నుండి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదురుకొంటున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రతిపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పింఛన్ విషయంలో తీసుకునే నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఖజానాను పొదుపు చేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version