ప్రజాపాలనలో బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ 2024ను విజయవంతంగా ముగించినదని వివరించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు చేసుకోవడానికి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవనుందని మంత్రి వెల్లడించారు.
న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు బుధవారం హాలీడే ప్రకటించిన నేపథ్యంలో మంత్రి కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. కొత్త ఏడాదిలో ప్రభుత్వం ముందున్న టాస్కులు, బీసీ సంక్షేమ శాఖ చేపట్టాల్సిన పెండింగ్ పనులపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.