భార్య మీద కోపం… కూతుర్ని నేలకేసి కొట్టాడు

తల్లి తండ్రుల మధ్య జరిగిన గొడవ కారణంగా 3 ఏళ్ళ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఉత్తర ప్రదేశ్‌ లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. పోలీసు అధికారులు తెలిపిన కథనం ప్రకారం… సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ పరిధిలో బరోలా గ్రామంలో నివాసం ఉండే దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే వారు శనివారం కూడా గొడవ పడ్డారు.Thai man arrested after rape and murder of German tourist - SE Asia - The  Jakarta Post

ఈ క్రమంలో తండ్రి చిన్నారిని నేలకేసి కొట్టాడు. దీనితో అక్కడిక్కడే చిన్నారి ప్రాణాలు విడిచింది. తల్లికి కూడా కొన్ని గాయాలు అయ్యాయి అని వెంటనే ఆసుపత్రికి తరలించారని అక్కడ మహిళ చికిత్స పొందుతోంది” అని నోయిడా అదనపు పోలీసు కమిషనర్ రణవిజయ్ సింగ్ తెలిపారు. మద్యం సేవించి భార్యతో తరుచుగా గొడవ పడే వాడు అని… నిందితుడు అమిత్ గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు.