హై అలర్ట్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం నుంచి తెలంగాణలో జోరు వానలు కురుస్తున్నాయి. అలాగే సోమ, మంగళవారాల్లో కూడా 90% ప్రాంతాల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.

rains-in-telanga
 

ఇకపోతే, ఏపీలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇకపోతే ఇవాళ తెల్లవారుజుము నుంచి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది.