Anikha surendran : నీలిరంగు చీరలోన బుట్టబొమ్మ నువ్వే జాన

-

అనికా సురేంద్రన్ అంటే చాలా మందికి తెలియదేమో కానీ.. బుట్టబొమ్మ అనగానే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనికా. ఎంతవాడు గానీ, విశ్వాసం సినిమాలతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైంది.

ఇక చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడు హీరోయిన్గ గా తన ప్రస్థానం మొదలుపెట్టింది. ఇటీవలే తెలుగులో బుట్టబొమ్మ అనే సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో కథానాయికగా తన నటన, అందంతో అనిక అలరించింది.

ప్రస్తుతం అనిక తనకు వస్తున్న అవకాశాలతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా అనిక బ్లూ కలర్ చీరలో ఫొటోలు దిగింది. ఈ ఫొటోల్లో అనిక చాలా అందంగా కనిపిస్తోంది. చీరకట్టులో బుట్టబొమ్మలా అదిరిపోయింది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు అనిక చాలా అందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news