అనిల్‌ను మంత్రిని చేసింది టీడీపీ నేతే…!

-

ఈ ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు మంత్రిగా ఉన్న నారాయ‌ణ‌ను ఎన్నిక‌ల్లో ఓడించి మంత్రి అయిన అనిల్‌కుమార్ యాద‌వ్‌ల మ‌ధ్య జ‌రిగిన ఓ సంఘ‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు హ‌ట్ టాపిక్‌గా మారింది. అనిల్ రాజ‌కీయాల‌కు రాక‌ముందు జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌పై ఇప్పుడు హాట్‌..హాట్‌గా చ‌ర్చ సాగుతోంది. అనిల్‌కుమార్ రాజ‌కీయాల్లోకి రాక ముందు ఉద్యోగం కోసం నారాయ‌ణ వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న విద్యాసంస్థ‌ల్లో ఉద్యోగం ఇవ్వాల‌ని అభ్య‌ర్థించార‌ట‌.  అందుకు నారాయ‌ణ కుద‌ర‌ద‌ని చెప్పార‌ట‌. ఇప్పుడు ఆయ‌న అదే నారాయ‌ణ‌పై గెలిచి మంత్రి అయ్యారు. ఈ విష‌యాన్ని త‌న తాజా ఇంట‌ర్వ్యూలో అనిల్ స్వ‌యంగా వెల్ల‌డించారు.

నారాయ‌ణ ఉద్యోగం ఇవ్వ‌న‌ని చెప్పాక ఆ త‌ర్వాత అనుహ్యంగా అనిల్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆ త‌ర్వాత‌ కార్పొరేట‌ర్‌గా పోటీ చేసి గెలిచారు. వైసీపీలో చేరి బ‌ల‌మైన నేత‌గా ఎదిగారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాజీమంత్రి నారాయ‌ణ‌పైనే ఆయ‌న విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. అనిల్ అడిగిన‌ప్పుడు ఉద్యోగం ఇచ్చి ఉంటే నారాయ‌ణ‌కు ఈ ప‌రిస్థితి వ‌చ్చి ఉండేది కాదంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి.

ప్చ్ ఏం చేస్తాం ఎలా ? జ‌ర‌గాల‌ని రాసిపెట్టి ఉంటే అలానే జ‌రుగుతుందంటూ..! అనిల్ అభిమానులు నారాయ‌ణ‌కు సానుభూతిని ప్ర‌క‌టిస్తూ ఆనంద‌ప‌డుతున్నార‌ట‌.  రాజ‌కీయాల్లో ఈ స్థాయిలో ఎదుగుతాన‌ని బ‌హుశా ఆయ‌న కూడా ఊహించి ఉండ‌ర‌ని అనిల్ స‌న్నిహితులు పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం. నెల్లూరు రాజ‌కీయాల నుంచి ఎదిగిన రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ ఇప్పుడు వైసీపీకి ప్ర‌ధాన బ‌లంగా మారారు. జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఆయ‌న ప్ర‌భావితం చేస్తున్నారు. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా రాజ‌కీయ వ‌ర్గాలు విశ్వ‌సిస్తున్నాయి.

జ‌గ‌న్ వ‌ద్ద అనిల్‌కు మంచి పేరు ఉంది.  గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌, మాజీమంత్రి నారాయ‌ణ‌పై ఆయ‌న విజ‌యం సాధించడంతో వైసీపీలోనే కాదు..నెల్లూరు రాజ‌కీయాల్లో కూడా ఆయ‌న‌కు తిరుగులేకుండా పోయింది. ప్ర‌స్తుతం జిల్లా రాజ‌కీయాల‌ను పూర్తిగా ఆయ‌న శాసిస్తున్నార‌నే చెప్పాలి. జిల్లా అభివృద్ధిలో..ప‌ద‌వుల కేటాయింపు..అధికారుల నియామ‌కం..ఇలా ప్ర‌తీ దానిలోనూ అనిల్ ముద్ర క‌నిపిస్తోందంట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version