500 మంది ఫైటర్స్ తో బాలకృష్ణ భారీ పోరాటం…..!!

-

టాలీవుడ్ యువరత్న నందమూరి బాలకృష్ణ, ఈ ఏడాది ప్రథమార్ధంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల ఫ్లాప్ తరువాత కొంత ఆలోచన చేసి, చివరికి తనకు గత ఏడాది మంచి విజయాన్ని అందించిన కేఎస్ రవికుమార్ కే తన తదుపరి సినిమా అవకాశం కల్పించారు. ఇక వారిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు ‘రూలర్’ అని ఇటీవల టైటిల్ నిర్ణయించడం జరిగింది. ధర్మ అనే మాస్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో సోహాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తుండగా మరొక హీరోయిన్ భూమిక చావ్లా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఇటీవల ఈ సినిమా నుండి అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న బాలకృష్ణ  పిక్స్ రిలీజ్ అయి నందమూరి ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని శంషాబాద్ ప్రాంతంలో జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ ఏకంగా 500 మంది ఫైటర్స్ తో ఒక భారీ పోరాట సీన్ లో పాల్గొంటున్నారట. ఈ భారీ సీన్ సినిమాలో అదిరిపోతుందని, అలానే ఆయన ఫ్యాన్స్  ఈ సీన్ కు థియేటర్స్ లో విజిల్స్ తో అదరగొట్టడం ఖాయమని సినిమా యూనిట్ నమ్మకంగా ఉందట.

యువ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత సారథ్యంలోని ఈ సినిమా సాంగ్స్ ని అతి త్వరలో యూట్యూబ్ లో ఒక్కొక్కటిగా రిలీజ్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సి కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రప్రంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మరి వరుసగా రెండు ఫ్లాప్స్ చవిచూసిన బాలకృష్ణకు ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అందిస్తుందో వేచి చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version