Animal Movie : ‘యానిమల్’కు ఒక్క రోజులో రూ.116 కోట్లు

-

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో టీసిరీస్ నిర్మించిన చిత్రం యానిమల్. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబి డియోల్, తెలుగు నటులు బబ్లు పృథ్విరాజ్, మాగంటి శ్రీనాథ్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Animal Movie collections

యానిమల్ సినిమాలో భారీగా నటీనటులు, అత్యుత్తమ సాంకేతిక నిపుణుల కలయికలో నిర్మించడంతో భారీ వ్యయం అయింది. యాక్టర్లు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే.. యానిమల్ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 116 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు నిర్మాతలు వెల్లడించారు. నార్త్ అమెరికాలో 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news