అన్నాత్తే రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే ?

-

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో అన్నయ్య పేరుతో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో రజనీ కాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోండగా ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి చాలా మేర టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసింది చిత్ర యూనిట్. అయితే కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ విధించడం వల్ల ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ ని నిలిపివేశారు.

లాక్ డౌన్ తరువాత మొదలు పెట్టినా సరే ఒకే రోజు సెట్ లో ఏడు కరోనా పాజిటివ్ కేసులు బయటపడడంతో అప్పటికప్పుడు నిలిపివేశారు. రజనీకాంత్ కి కూడా తీవ్ర అస్వస్థత ఏర్పడడంతో ఆయన చెన్నై వెళ్ళిపోయారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పట్లో మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. అయితే ఈ సినిమాని నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నామని కొద్ది సేపటి క్రితం ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెలుగు తమిళంలో రిలీజ్ చేస్తుండగా వరసగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న రజనీకాంత్ ‘అన్నాత్తే’ మీద భారీ గా అంచానాలు పెట్టుకున్నారు. అంతేకాదు ఆయన అభిమానులు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న ధీమాతో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news