వాట్సాప్ కారణంగా ప్రస్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజర్లకు ఇబ్బందులు వచ్చాయి. ఫేస్‌బుక్‌ను ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై వాడుతున్న కొందరి అకౌంట్లు ఆటోమేటిగ్గా లాగవుట్ అయ్యాయి. అయితే అకౌంట్లలోకి లాగిన్ అవ్వాలని చూస్తే అందుకు సాధ్యం కావడం లేదని యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నారు.
ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై ఫేస్‌బుక్ యాప్‌ను వాడుతున్న యూజర్లు ఆ యాప్ నుంచి ఆటోమేటిగ్గా లాగవుట్ అయ్యారు. అయితే కొందరు యూజర్లు తిరిగి లాగిన్ అయినప్పటికీ కొందరికి మాత్రం లాగిన్ అవ్వడం వీలు కావడం లేదు. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించినప్పటికీ ఫేస్‌బుక్‌లోకి తిరిగి లాగిన్ అవలేకపోతున్నామని యూజర్లు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు.
అయితే ఈ సమస్యకు స్పందించిన ఫేస్‌బుక్ సమస్యను పరిష్కరించామని తెలిపింది. కానీ కొందరికి మాత్రం ఇంకా సమస్య అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొందరు యూజర్లు అయితే ఆటోమేటిగ్గా ఫేస్ బుక్ నుంచి బ్యాన్ అయ్యారు. వారికి ఈ నెల 22వ తేదీ నుంచి అకౌంట్ యాక్సెస్ అవడం లేదు. 23వ తేదీ వరకు సమస్యను పరిష్కరించామని ఫేస్‌బుక్ చెబుతోంది. అయినప్పటికీ కొందరికి ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అవడం వీలు కావట్లేదు. మరి దీనిపై ఫేస్‌బుక్ ఏమని స్పందిస్తుందో చూడాలి.